: అసోంలో అధికారంలోకి వస్తే బంగ్లా వలసదారులకు పౌరసత్వం: అమిత్ షా
బీహార్, అసోం రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో గౌహతిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే అసోం ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారతీయ పౌరసత్వం ఇస్తామని షా ప్రకటించారు. ఒక్క అసోంలోని బంగ్లా హిందువులకే కాకుండా దేశ వ్యాప్తంగా వలస వచ్చిన హిందువులకు కూడా పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు. మతపరమైన సమస్యల కారణంగా చాలామంది హిందువులు బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్నారని, వారందిరినీ బీజేపీ తప్పకుండా ఆదరిస్తుందని షా పేర్కొన్నారు.