: దుమికిన భారతీ ఇన్ ఫ్రాటెల్... 18 శాతం పెరిగిన నికర లాభం
విస్తరణ ప్రణాళికల్లో భాగంగా పెరిగిన టవర్లు, అధిక మార్జిన్లు గడచిన ఆర్థిక సంవత్సరం జనవరి - మార్చి మధ్యకాలంలో నెంబర్ వన్ టెలికం సంస్థ భారతీ ఎయిర్ టెల్ అనుబంధ మౌలిక సేవల సంస్థ భారతీ ఇన్ ఫ్రాటెల్ ఫలితాలు అంచనాలను మించాయి. ఈ మూడు నెలల కాలంలో నెట్ ప్రాఫిట్ 18 శాతం పెరిగి రూ. 746 కోట్లకు, ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 2,947 కోట్లకూ పెరిగాయని సంస్థ సోమవారం ఉదయం ప్రకటించింది. సమీప భవిష్యత్తులో మరింత అధిక వృద్ధిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని సంస్థ చైర్మన్ అఖిల్ గుప్తా ఈ సందర్భంగా వివరించారు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో 3జి, 4జి సేవలను ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు.