: అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పడిపోయిన బంగారం ధర


ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్న వేళ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కుదేలైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సింగపూర్ సెషన్లో ఔన్సు బంగారం (సుమారు 28.35 గ్రాములు) ధర 1,182.70 డాలర్లకు (సుమారు రూ. 74,983 - డాలర్ తో రూపాయి మారక విలువ రూ.63.40పై) చేరింది. మార్చి 20న 1,174 డాలర్ల నుంచి పైకి పెరిగిన బంగారం ధర తిరిగి అదే స్థాయికి దగ్గరగా రావడం ఇదే తొలిసారి. దీంతో ఇండియన్ మార్కెట్లో సైతం ధరలు గణనీయంగా దిగివస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్నటి సెషన్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ముంబైలో రూ. 28,171 రూపాయల వద్ద కొనసాగింది. అంతర్జాతీయ ట్రెండ్స్ అనుసరించి ఈ ధర 26,400 దరిదాపుల్లోకి రావాల్సి వుంది. అంటే మరో రూ. 1800 వరకూ ధర తగ్గుతుందన్నమాట. ఇక రూ. 27,155 వద్ద ఉన్న హైదరాబాద్ ధర రూ. 25,850 వరకూ తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News