: చంద్రబాబును కలసిన టి.మంత్రి జోగు రామన్న... కుమారుడి వివాహానికి ఆహ్వానం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగు రామన్న కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుమారుడి వివాహ పత్రికను బాబుకు అందజేశారు. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకే సీఎం చంద్రబాబును కలసినట్టు జోగు రామన్న తరువాత మీడియాకు తెలిపారు.