: బోర్డు తిప్పేసిన రత్నమాల చిట్ ఫండ్... తాడేపల్లిగూడెం వాసులకు రూ.4 కోట్ల మేర కుచ్చుటోపీ


తెలుగు రాష్ట్రాల్లో చిట్ ఫండ్ సంస్థల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. జనం అమాయకత్వమే పెట్టుబడిగా పుట్టుకొస్తున్న చిట్ ఫండ్ సంస్థలు ముందుగానే నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు డిపాజిట్లు చేతికందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. ఈ తరహా ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొద్దిసేపటి క్రితం వెలుగు చూసింది. రత్నమాల చిట్ ఫండ్ పేరిట దుకాణం తెరిచిన మాయగాళ్లు పట్టణ జనం నుంచి రూ.4 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి ఉడాయించారు. జరిగిన మోసాన్ని గుర్తించిన డిపాజిట్ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ‘రత్నమాల’ మాయగాళ్ల కోసం వేట మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News