: ‘హోదా’పై ప్రతిపక్షాలది రాద్ధాంతమే: ఏపీ మంత్రి యనమల వ్యాఖ్య


ఓ వైపు ఏపీకి ప్రత్యేక హోదాపై నలువైపులా విమర్శలు వెల్లువెత్తుతుంటే, టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం వాటిని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదన అంతా రాద్ధాంతమేనని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. అసలు ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలకు అవగాహనే లేదని కూడా ఆయన తేల్చేశారు. ప్రతిపక్షాలకు రాజకీయ లబ్ధి తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టడం లేదని కూడా ఆయన ప్రతివిమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News