: పెట్టుబడుల్లో దూసుకెళుతున్న రతన్ టాటా...జియోమీలో వాటా కొనుగోలు


టాటా గ్రూపు సంస్థల చైర్మన్ గా రిటైర్ అయిన తర్వాత రతన్ టాటా చిన్న కంపెనీల్లో పెట్టుబడులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మొన్నటికి మొన్న దేశీయ ఈ-టెయిలింగ్ రంగంలో దూసుకెళుతున్న స్నాప్ డీల్ లో వాటా తీసుకున్న రతన్ టాటా, తాజాగా చైనా మొబైల్ తయారీ సంస్థ జియోమీలో వాటా కొనుగోలు చేశారట. వ్యక్తిగత హోదాలోనే జియోమీలో వాటా కొనుగోలు చేసిన రతన్ టాటా, ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డులోనూ స్థానం సంపాదించారు. రతన్ టాటా పెట్టుబడిని ధ్రువీకరించిన జియోమీ ఇండియా చీఫ్ మనూ జైన్... టాటా ఏ మేరకు పెట్టుబడి పెట్టింది, ఎంత వాటా కొనుగోలు చేసిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. జియోమీని భారతీయ కంపెనీగా తీర్చిదిద్దే క్రమంలో రతన్ టాటా పెట్టుబడులు తమకు ఎంతగానో ఉపయోగపడగలవని జియోమీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News