: టీడీపీ శాసన సభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మృతి
తెలుగుదేశం శాసన సభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య ఈ తెల్లవారుజామున హైదరాబాదులో కన్నుమూసారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసన సభ్యుడైన బ్రాహ్మణయ్య గత కొంత కాలంగా ఉదరకోశ వ్యాదితో గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి ముదిరిపోవడంతో ఈ తెల్లవారుజామున ఆయన మరణించారు.
పంచాయతీ వార్డు మెంబరుస్థాయి నుంచి పార్లమెంటు సభ్యుడు స్థాయికి ఎదిగిన బ్రాహ్మణయ్య నైతిక విలువలు గల రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. 1994లో మచిలీపట్నం శాసనసభ్యుడిగా ఎన్నికైన ఈయన, 2004లో మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి తెలుగదేశం తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. తర్వాత 2009 నుంచి అవనిగడ్డ శాసన సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. దివిసీమలో రైతు సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతగానో కృషి చేశారు