: 95 పరుగులకే తోకముడిచిన ఢిల్లీ


ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 95 పరుగులకే తోకముడిచింది. నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరు బౌలర్లు ఢిల్లీ జట్టును ఐపీఎల్ సీజన్ లో అత్యల్ప స్కోరుకు పరిమితం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు రెండు పరుగుల వద్ద ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ (0) వికెట్ కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుమిని (13) జాగ్రత్తగా ఆడినప్పటికీ వైస్ వేసిన అద్భుతమైన బంతికి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చి యువరాజ్ సింగ్ (2), మాధ్యూస్ (0), కౌల్టర్ నైల్ (4), మిశ్రా (2), నదీమ్ (2), ముత్తుస్వామి(1) వైఫల్యం చెందగా, మయాంఖ్ అగర్వాల్ (18), కేదార్ జాదవ్ (33) ఢిల్లీని ఆదుకున్నారు. వీరు చేసిన స్కోరు కారణంగా ఢిల్లీ జట్టు పదివికెట్ల నష్టానికి గౌరవప్రదమైన 95 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీసి రాణించగా, ఆరోన్, వైస్ చెరి రెండు వికెట్లతో, పటేల్, ఇక్బాల్ అబ్దుల్లా చెరో వికెట్ తీసి అతనికి చక్కని సహకారమందించారు. 96 పరుగుల విజయలక్ష్యంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News