: నిన్న పెను భూకంపం...నేడు భారీ వర్షం...ఖాట్మండు అతలాకుతలం


నిన్నటి పెను భూకంపం నేపాల్ రాజధాని ఖాట్మండుని అతలాకుతలం చేస్తే, నేడు భారీ వర్షం వారిని మరింత ఆందోళనకు గురిచేసింది. వడగండ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసేశారు. దీంతో నేపాల్ లో జరుగుతున్న సహాయక చర్యలకు పెను విఘాతం కలిగింది. భూ ప్రకంపనాలకు భయపడి ఆరుబయట టెంటుల్లో గడుపుతున్న నేపాలీలకు జోరున కురుస్తున్న వర్షం ఆ అవకాశం కూడా లేకుండా చేస్తోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన చోటుచేసుకుంది. కాగా, నేపాల్ నుంచి పలు దేశాలకు చేరాల్సిన యాత్రికులు వర్షం కారణంగా విమానాలు రద్దవ్వడంతో ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News