: సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీతో సరిపడదు: ఏచూరి
కాంగ్రెస్ పార్టీకి, వామపక్ష పార్టీలకు సైద్ధాంతికంగా సరిపడదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా తొలిసారిగా పశ్చిమ బెంగాల్ వచ్చిన సందర్భంగా కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, సైద్ధాంతిక విభేదాల కారణంగా కాంగ్రెస్ తో జతకట్టే ప్రసక్తిలేదని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, హిందూత్వ ఎజెండాపై పోరాడేందుకు అన్ని పార్టీల సహకారం తీసుకుంటామని ఆయన తెలిపారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి అంశాల వారీగా సహకరిస్తామని ఆయన వెల్లడించారు.