: వచ్చే నాలుగు రూపాయలు రావని బాబు భయపడుతున్నారు: శివాజీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుపోయారని సినీ నటుడు శివాజీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై లోక్ సభ సాక్షిగా లిఖితపూర్వక సమాధానం వచ్చిన తరువాత కూడా వస్తుందని ప్రజలను మభ్యపెట్టడం సరికాదని హితవు పలికారు. బీజేపీ చంద్రబాబును ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టడంతో కేంద్రాన్ని ఎదిరిస్తే, వచ్చే నాలుగు పైసలు కూడా రావేమోనని బాబు భయపడుతున్నారని శివాజీ వెల్లడించాడు. ఇప్పటికే రాష్ట్రం కష్టాల్లో ఉందని, కేంద్రాన్ని ఎదిరిస్తూ మరిన్ని కష్టాల్లో కూరుకుపోవడం ఇష్టంలేని ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తున్నారని శివాజీ చెప్పాడు. పగలనక రాత్రనక, ఇల్లు వదిలి చంద్రబాబు కష్టపడుతుంటే, ఆయనకి మరిన్ని నిధులు, హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు వస్తున్నాయని అంతా చెబుతున్నారని, వాటి వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే ఉపయోగం ఎవరైనా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదావస్తే, రాయితీలు వస్తాయని, తద్వారా పరిశ్రమలు వచ్చి, యువతకు ఉపాధి దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News