: శివాజీపై దాడికి సోము వీర్రాజు అనుచరుల ప్రయత్నం


బీజేపీ నేత సోము వీర్రాజు వర్గీయులు సినీ నటుడు శివాజీపై దాడికి ప్రయత్నించిన సంఘటన చోటుచేసుకుంది. రాజమండ్రిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శివాజీని షెల్టన్ హోటల్ లో నిర్బంధించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వీరంగం వేశారు. పోలీసులు సకాలంలో రంగప్రవేశం చేయడంతో సోము వీర్రాజు వర్గీయుల దాడిని శివాజీ తప్పించుకోగలిగారు. తాను స్వప్రయోజనాల కోసం పోరాడడం లేదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని వారితో శివాజీ చెప్పినప్పటికీ, మహిళల దండుతో వచ్చిన సోము వీర్రాజు అనుచరులు అతనిపై దాడికి ప్రయత్నించడం విశేషం. దీంతో అతని స్నేహితులు, పోలీసుల సాయంతో అక్కడి నుంచి తప్పించుకున్నట్టు శివాజీ తెలిపాడు. శివాజీ హోటల్ నుంచి వెళ్లిపోయినప్పటికీ, హోటల్ ముందు సోము వీర్రాజు వర్గీయులు ఆందోళన చేయడం విశేషం.

  • Loading...

More Telugu News