: మరో 72 గంటల పాటు నేపాల్ లో ఎమర్జెన్సీ...రోడ్ల మీదే ప్రజలు
మరో 72 గంటలపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు నేపాల్ ప్రధాని కోయిరాల ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులను రక్షించేందుకు దేశప్రజలంతా స్వచ్చందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భూకంపం కారణంగా నేపాల్ లో ఇప్పటి వరకు 2200 మంది మృతి చెందినట్టు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ ఎమర్జెన్సీ ప్రకటించడంతో నేపాలీలు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. దీంతో నేపాల్ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైనే సేదదీరుతున్నారు.