: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి, చెక్ డ్యాం నిర్మించండి: 'సెల్ టవర్' సంజీవరావు డిమాండ్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ గుంటూరులో సెల్ టవర్ ఎక్కిన సంజీవరావు 30 గంటలుగా అక్కడే ఉన్నాడు. అతనిని సెల్ టవర్ నుంచి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 30 గంటలుగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసించిన సంజీవరావును కిందికి దించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సెల్ టవర్ వద్దకు చేరుకుని ఫోన్ లో సంజీవరావుతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా ప్రకటిస్తేనే కిందికి దిగుతానని, అలాగే తమ గ్రామంలో చెక్ డ్యాం నిర్మించాలని కోరాడు. చెక్ డ్యాం నిర్మిస్తామని, కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదాపై పోరాటం చేద్దామని మంత్రి చెప్పినప్పటికీ సంజీవరావు శాంతించలేదు. తనవద్దకు ఎవరైనా వస్తే దూకేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో టవర్ కింది భాగంలో వలలు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News