: మూడు వేల మందితో 'గే' ర్యాలీ
పాశ్చాత్య దేశాల్లో స్వలింగ సంపర్కానికి బాగానే మద్దతు పెరుగుతోంది. స్వలింగ వివాహాలు భారీ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. లెస్బియన్, గే, ట్రాన్స్ జెండర్ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ వాటి మద్దతుదారులు జపాన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. టోక్యోలోని ఎంటర్ టైన్ మెంట్, షాపింగ్ కు ప్రసిద్ధి చెందిన షిబుయా జిల్లాలో మూడు వేల మంది లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ సభ్యులు, వారి మద్దతుదారులతో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. తాము సమాజంలో భాగమే కనుక తమ హక్కులను గౌరవిస్తూ, తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని వారు నినదించారు. ఈ ర్యాలీలో సెక్స్ వర్కర్స్ కూడా పాల్గోవడం విశేషం.