: బీసీసీఐ సమావేశంలో వాడివేడి చర్చ...శ్రీనివాసన్ పై దాల్మియా సీరియస్


బీసీసీఐ పాలకవర్గ సమావేశం వాడివేడిగా జరుగుతోంది. బీసీసీఐలో గతంలో జరిగిన అవకతవకలు, అరాచకాలపై చర్చ జరుగుతోంది. శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఉండగా, పాలకవర్గం సభ్యులపై నిఘా పెట్టడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐలో పరస్పర ప్రయోజనాలు పెనవేసుకుపోవడంపై అంతా విస్మయం వ్యక్తం చేశారు. క్రికెట్ భవిష్యత్ కు ఇది అత్యంత ప్రమాదకరం అని బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా పేర్కొన్నారు. ఇండియా సిమెంట్స్ లో భాగస్వామ్యం ఉన్న పాలకవర్గ సభ్యులను తొలగిస్తున్నట్టు దాల్మియా తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పాలకవర్గ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీనివాసన్ పై అంతా మండిపడ్డారు.

  • Loading...

More Telugu News