: నీతూ అగర్వాల్, మస్తాన్ వలీ వేసిన 'వేషాలు' వర్ణించలేం: 'ప్రేమ ప్రయాణం' హీరో
ఎర్ర స్మగ్లర్ మస్తాన్ వలీ 'ప్రేమ ప్రయాణం' సినిమా నిర్మించినప్పుడు తమకు చుక్కలు చూపించేవాడని ఆ సినిమాలో హీరోగా నటించిన మనోజ్ నందం తెలిపాడు. సినిమా షెడ్యూల్ ప్రకారం జరగలేదని, దానికి కారణం వారిద్దరిమధ్య ఉన్న సన్నిహిత సంబంధాలేనని వెల్లడించాడు. స్పాట్ లో నిర్మాత లేకపోతే నీతూ అగర్వాల్ షూటింగ్ జరగనిచ్చేది కాదని, తలనొప్పి అనో లేక ఇంకోటనో చెప్పి షూటింగ్ ఆపేసేదని, దాని కారణంగా తాను రెండు అవకాశాలు కోల్పోయానని మనోజ్ నందం తెలిపాడు. ఇప్పటి వరకు తాను ఆ సినిమానే చూడలేదని, ఎందుకంటే సినిమాను వాళ్లు ఇష్టపడి తీయలేదని, అసలు సినిమా పూర్తవుతుందని కూడా భావించలేదని అతను చెప్పాడు. నీతూ కోసం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తానని మస్తాన్ వలీ చెప్పేవాడని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయని మనోజ్ నందం వెల్లడించాడు. షూటింగ్ లో ఎవరూ ఇబ్బంది పెట్టకుండా విపరీతంగా డబ్బు వెదజల్లేవాడని మనోజ్ తెలిపాడు. తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం ఇష్టం ఉండదని, తన పని తాను చూసుకున్నానే తప్ప, వారి విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదని మనోజ్ నందం చెప్పాడు.