: మోదీజీ ధన్యవాదాలు... మీ మేలు మరిచిపోలేం: బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా


భూకంపాల తీవ్రతకు నేలకూలిన నేపాల్ ను మళ్లీ నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం చూపిస్తున్న చొరవపై నేపాలీలు ధన్యవాదాలు చెబుతున్నారు. నేపాల్ భూకంపంపై భారత్ అత్యంత వేగంగా స్పందించిన తీరు ఆ దేశ పౌరుల గుండెలను తాకింది. నేపాల్ కు చెందిన బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మోదీ స్పందించిన తీరుపై ప్రశంసల జల్లు కురిపించింది. తమ దేశాన్ని ఆదుకునేందుకు మోదీ స్పందించిన తీరుకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువేనని మనీషా పేర్కొంది. ‘‘భూకంపం తర్వాత నేపాల్ ను చూసిన నాకు కన్నీళ్లు ఆగలేదు. ఈ సందర్భంగా నేపాల్ ను ఆదుకున్న భారత్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మోదీ గారు... మీరు ఇంత త్వరగా స్పందించి చేసిన సాయాన్ని ఎల్లవేళలా మా గుండెల్లో గుర్తుంచుకుంటాం. ధన్యవాదాలు మోదీజీ’’ అని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News