: ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని తమిళ సీఎం ప్రశ్నిస్తున్నారు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్


ఏపీకి ప్రత్యేక హోదా అంశం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ అంశంపై తమకేమీ సంబంధం లేకున్నా, కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చేతులు కట్టేస్తున్నాయట. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ ఏపీకి అందించి తీరతామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కూడా దక్కుతుందని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా కోసం దేశంలోని పలు రాష్ట్రాలు కోరుతున్నాయని వివరించారు. అయినా, ఏపీకి ప్రత్యేక హెోదా ఎలా ఇస్తారని తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ప్రశ్నిస్తున్నారని నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

  • Loading...

More Telugu News