: ‘హోదా’ కోసం పోరాడకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: చంద్రబాబుపై ఉండవల్లి ఫైర్
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగానే ఏపీకి ప్రత్యేక హోదా సాధించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్డీఏ సర్కారుకు అల్టిమేటం జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే, నరేంద్ర మోదీ కేబినెట్ నుంచి తన పార్టీ మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.