: చెన్నై ‘సూపర్’ షో... 97 పరుగుల తేడాతో పంజాబ్ చిత్తు


ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకెళుతోంది. నిన్నటిదాకా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ధోనీ సేన, రాత్రికి రాత్రే అగ్రస్థానంకి చేరింది. నిన్న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్, నెట్ రన్ నెట్ లోనూ అగ్రగామిగా నిలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ కూల్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా, మెక్ కల్లమ్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 44 బంతులను ఎదుర్కొన్న బ్రెండన్ ఏకంగా 66 పరుగులు రాబట్టాడు. కెప్టెన్ ధోనీ కూడా (41) అదే స్థాయిలో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ తర్వాత 193 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్, చెన్నై బౌలర్ల ధాటికి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మురళీ విజయ్ (34) మినహా పంజాబ్ బ్యాట్స్ మన్ మొత్తం విఫలమయ్యారు. దీంతో పంజాబ్ పై చెన్నై 97 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

  • Loading...

More Telugu News