: ‘ఎర్ర’ కేసులో సినీ నటి నీతూ అగర్వాల్ అరెస్ట్... కర్నూలుకు తరలింపు


ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో టాలీవుడ్ సినీ నటి, ‘ప్రేమ ప్రయాణం’ హీరోయిన్ నీతూ అగర్వాల్ అరెస్టైంది. మూడు రాష్ట్రాల్లో పోలీసులు ఆమె కోసం వేట సాగించగా, హైదరాబాదులోనే ఆమె పట్టుబడింది. నిన్న రాత్రి అరెస్టు చేసిన ఆమెను పోలీసులు కర్నూలుకు తరలించారు. ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నేత మస్తాన్ వలిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి స్మగ్లర్లకు పెద్ద ఎత్తున డబ్బు సరఫరా అయ్యింది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న కర్నూలు జిల్లా పోలీసులు రుద్రవరం పోలీస్ స్టేషన్ లో నీతూపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలుగా బయలుదేరిన పోలీసులు హైదరాబాదు, బెంగళూరు, ముంబైల్లో ముమ్మర సోదాలు చేశారు. అయితే ఆమె హైదరాబాదులోనే పోలీసులకు పట్టుబడటం గమనార్హం.

  • Loading...

More Telugu News