: సీస్మిక్ జోన్ లో నవ్యాంధ్ర రాజధాని... భవిష్యత్తులో ముప్పు తప్పదా?


నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూకంపం ముప్పు పొంచి ఉందట. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలు సీస్మిక్ జోన్ కిందకే వస్తాయని చెబుతున్న నిపుణులు, జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదని వాదిస్తున్నారు. నేపాల్ భూకంపం నేపథ్యంలో ఈ వాదన ఏపీ వాసులను కలవరపాటుకు గురి చేస్తోంది. సాధారణంగా భూకంప తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను పలు కేటగిరీలుగా విభజించారు. ఇందులో సీస్మిక్ జోన్-3 కింద కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయట. ఇదే విషయాన్ని రాజధాని ప్రాంతం ఎక్కడన్న అంశంపై అధ్యయనం చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నేపాల్ లో పెను భూకంపం నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఏర్పాటు కానున్న అమరావతికి భూకంపం ముప్పు పొంచి ఉందన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే సీస్మిక్ జోన్-3లో ఉన్న ప్రాంతాల్లో భూ ప్రకంపనలు తప్ప, భూకంపాలు సంభవించే అవకాశం లేదని మరికొంత మంది నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News