: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 1,800 దాటింది... కొనసాగుతున్న సహాయక చర్యలు


నేపాల్ ను నేలమట్టం చేసిన భూకంపం కారణంగా ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 1,805కి చేరుకుంది. రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైన భారీ భూకంపం నిన్న మధ్యాహ్నం నేపాల్ ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. భూకంపం అనంతరం మృత్యువాత పడిన వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతూ వస్తోంది. నేటి ఉదయానికి 1,805 మంది మరణించినట్లు నేపాల్ అధికారవర్గాలు పేర్కొన్నాయి. భూకంపం కారణంగా ఆ దేశంలో 4,718 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాక శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచే ప్రారంభమైన సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదని సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న సిబ్బంది చెబుతున్నారు.

  • Loading...

More Telugu News