: నేపాల్లో 'ఎటకారం' చిత్ర బృందం క్షేమం


'ఎటకారం' సినిమా షూటింగ్ కోసం నేపాల్ వెళ్లిన యూనిట్ సభ్యులు భూకంపం కారణంగా ఆచూకీ తెలియకుండా పోవడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. అయితే, తాము క్షేమంగానే ఉన్నట్టు నిర్మాత తెలిపారు. భూకంపం రాగానే తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్టు ఆయన వెల్లడించారు. వీరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దినేశ్, హరిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిత్యపూజ కంబైన్స్ పతాకంపై రమేశ్ చందు, కిషన్ నిర్మిస్తున్నారు. 20 మందితో కూడిన ఈ చిత్ర బృందం శుక్రవారమే నేపాల్ కు వెళ్లింది. యూనిట్ సభ్యులంతా క్షేమంగానే ఉన్నట్టు నిర్మాత తెలిపారు.

  • Loading...

More Telugu News