: ఎవరెస్టుపై భూకంపం ఎఫెక్ట్.... 18 మంది పర్వతారోహకుల దుర్మరణం


నేపాల్ లో సంభవించిన తీవ్ర భూకంపం హిమాలయాల్లోని మౌంట్ ఎవరెస్టుపైనా ప్రభావం చూపింది. భూకంపం ధాటికి మంచు చరియలు విరిగిపడడంతో 18 మంది పర్వాతారోహకులు దుర్మరణం పాలయ్యారని నేపాల్ టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో విదేశీయులతో పాటు నేపాలీ షెర్పాలు (గైడ్లు) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఎవరెస్టు బేస్ క్యాంపు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో, పర్వతారోహకులకు నేపాల్ సర్కారు హెచ్చరికలు జారీచేసింది. హిమాలయాలను వీడి వచ్చేయాలని సూచించింది. మంచు చరియల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News