: దర్శకుడిని హత్య చేసిన తమిళ నటికి జీవితఖైదు


సరిత అలియాస్ సంగీత... తమిళ సినీ పరిశ్రమలో ఓ చిన్న నటి. ఓ వివాదం నేపథ్యంలో, దర్శకుడిని హత్య చేసింది. ఇప్పుడామెకు జీవిత ఖైదు విధించారు. వివరాల్లోకెళితే.... 2007లో వర్ధమాన దర్శకుడు సెల్వా ఓ చిత్రంలో నటించేందుకు సంగీతను ఎంపిక చేసుకున్నాడు. తన పారితోషికం చెల్లించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, సెల్వా వడపళనిలోని ఓ లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకుని, సినిమా గురించి చర్చించాలంటూ నటీనటులను పిలిచాడు. అందులో సంగీత కూడా ఉంది. అప్పటికే అతడిపై ఆగ్రహంతో ఉన్న ఆమె ఇదే అదనుగా గొంతు నులిమి చంపేసింది. అనంతరం, గదికి తాళం వేసి పరారైంది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేయగా, బెయిల్ పై బయటికొచ్చి ఏడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లింది. గతేడాది డిసెంబర్ లో పోలీసులకు పట్టుబడింది. తాజాగా, విచారణ జరిపిన అడిషనల్ సెషన్స్ కోర్టు ఆమెకు జీవిత ఖైదుతో పాటు రూ.5000 జరిమానా విధించింది. కాగా, ఆమెకు సరైన పాత్ర ఇవ్వలేదన్న కారణంగా తలెత్తిన ఘర్షణే దర్శకుడి హత్యకు కారణమని మరో వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News