: కొచి, మంగళూరులో స్వల్ప భూ ప్రకంపనలు... బంగ్లాదేశ్ ను కూడా వణికించింది


దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఈ నేపథ్యంలో కేరళలోని కొచి, కర్ణాటకలోని మంగళూరు ప్రాంతాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. కాగా, ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం సంభవించిన సంగతి విదితమే. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, గుజరాత్ సహ పలు రాష్ట్రాల్లోనూ భూకంప ప్రభావం ఉంది. అటు బంగ్లాదేశ్ ను కూడా భూకంప తీవ్రత వణికించింది. అక్కడి భవనాల్లో ఒక్కసారిగా పగుళ్లు రావడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 40 మందికి గాయాలయ్యాయి. బంగ్లా రాజధాని ఢాకాలో కొద్ది సెకన్ల పాటు భూమి రెండు సార్లు కంపించింది.

  • Loading...

More Telugu News