: నా వైవాహిక జీవితం ఓ వైఫల్యమే: వర్మ
వివాదాలపుట్ట, దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి తన జీవితం గురించి మాట్లాడారు. తాజా ప్రాజెక్టు '365 డేస్' గురించి ఓ న్యూస్ ఏజెన్సీతో చెబుతూ, అది తన వివాహం ఆధారంగా తీసిన సినిమా కాదని వివరణ ఇచ్చారు. ఓ జంట వివాహానంతర ప్రస్థానమే ఆ చిత్ర కథాంశమని చెప్పారు. ఇక తన విషయానికొస్తూ, "నా వైవాహిక జీవితం కూడా విఫలమైంది. అయితే, నా అద్భుతమైన భార్య కారణంగా అలా జరగలేదు, ఆమెకు ఓ చెత్త భర్త దొరికినందునే పెళ్లి పెటాకులైంది" అని తనదైన శైలిలో పేర్కొన్నారు. భవిష్యత్తులో వివాహ వ్యవస్థ కనుమరుగైపోతుందని జోస్యం చెప్పారు. "ఓ పురుషుడు, ఓ స్త్రీ... ఒకరికి ఒకరు కావాల్సిందే. కానీ, పెళ్లి కారణంగా వారు కలిసి జీవించలేకపోతున్నారు. అందుకే వివాహ వ్యవస్థ ఎక్కువకాలం ఉండకపోవచ్చు. ప్రజలు స్నేహితుల్లా ఉండేందుకే మొగ్గు చూపుతారు" అని చెప్పారు.