: భూకంప ప్రభావంతో ఉత్తరప్రదేశ్, బీహార్ లో 10 మంది మృతి
నేటి ఉదయం సంభవించిన భూకంప ప్రభావంతో ఉత్తరప్రదేశ్, బీహార్ లో ప్రాణ నష్టం జరిగింది. యూపీలో ఐదుగురు మరణించారు. బీహార్ లో భగల్ పూర్ గోడ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. సీతామాడి, డర్భంగా, వైశాలిలో భవనాలు కూలడంతో ముగ్గురు మృతి చెందారు. చాలా చోట్ల భూప్రకంపనల వల్ల ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. అటు పశ్చిమబెంగాల్లో కూడా భూకంప తీవ్రతతో ఒకరు మరణించారు. జల్ పయ్ గురి జిల్లాలో భవనం కూలడంతో పాణ్యసింగరాయ్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఉత్తర బెంగాల్ లో పలుచోట్ల భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.