: నల్లగా ఉన్నాడని కట్టుకున్నవాడిని కడతేర్చింది!


గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ఫర్జానా (22) అనే యువతి భర్త ఫరూక్ ను కిరాతకంగా అంతమొందించింది. నల్లగా ఉన్నాడన్న కారణంతో అతనంటే అయిష్టత కనబర్చే ఫర్జానా చివరికి హత్యకు తెగించింది. కుటుంబ ఒత్తిళ్ల కారణంగా రెండేళ్ల క్రితం ఫర్జానా వివాహం ఫరూక్ తో జరిగింది. అయితే, ఆమె ఎక్కువగా పుట్టింట్లోనే ఉండేది. భర్తతో కాపురం చేసింది తక్కువే. నల్లగా ఉన్నాడని దూరంగా ఉంచేది. కాగా, 10 రోజుల కిందటే ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో, పొలానికి తీసుకువెళ్లి, అక్కడ తన కోరిక తీర్చాలంటూ భర్త బుధవారం రాత్రి ఫర్జానాను కోరాడు. అయితే, ఆమె అందుకు నిరాకరించింది. దీంతో మాటామాటా పెరిగింది. భర్త తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో తిరిగి వచ్చి ఓ సుత్తి తీసుకెళ్లింది. అసలే అయిష్టం... దానికి తోడు వాంఛ అంటూ వెంటబడడంతో ఆమెలో ఉన్మాదం ప్రవేశించింది. కసిదీరా దాంతో ఫరూక్ పై దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో అతగాడు అక్కడిక్కడే చనిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులు ఫరూక్ కోసం వెదకడం మొదలుపెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెట్లాద్ పోలీసులకు భార్య ఫర్జానా తీరు సందేహాలకు తావిచ్చింది. తొలుత బుకాయించిన ఆమె పోలీసుల లై డిటెక్టర్ పరీక్ష చేస్తామని చెప్పడంతో నేరం అంగీకరించింది. దీంతో, ఐపీసీ సెక్షన్ 302 కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News