: 'బిజినెస్ మేన్' తో అవార్డు కొల్లగొట్టిన పూరీ
పూరీ జగన్నాథ్... టీఎస్సార్ జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు కైవసం చేసుకున్నాడు. 2012లో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన మహేశ్ బాబు బిజినెస్ మేన్ చిత్రానికిగాను పూరీకి ఈ అవార్డు దక్కింది. కాగా, హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుకు ప్రత్యేక అవార్డు అందించారు. మూవీ మొఘల్ రామానాయుడికి 'రికార్డ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మిలీనియం' అవార్డు ప్రదానం చేశారు. చిరంజీవి ఈ అవార్డును రామానాయుడికి అందజేశారు. దూకుడు చిత్రానికి తమన్ 'బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్' అవార్డు అందుకున్నాడు.