: కరాచీలో మానవహక్కుల మహిళా నేత కాల్చివేత
మానవ హక్కులను కాపాడేందుకు ఉద్యమాలు చేస్తున్న సబీన్ మహమ్మద్ అనే మహిళా నేతను కరాచీలో హత్యచేశారు. ఒక హోటల్ నుంచి సబీన్ బయటకు వెళ్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె కారుపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సబీన్ ను, ఆమె తల్లిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో సబీన్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు. కాగా, సైలెన్సింగ్ బలూచిస్తాన్ పేరిట ఏర్పాటు చేసిన ఒక సెమినార్ లో ప్రసంగించిన ఆమె మానవ హక్కులపై నిరసన తెలియజేసేందుకు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆమె హత్య జరిగినట్టు తెలుస్తోంది.