: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు హింసాత్మకం
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న నగర పాలక సంస్థల ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. మొత్తం 91 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండగా, పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ రిగ్గింగ్ చేస్తోందని ఆరోపిస్తూ విపక్ష పార్టీల కార్యకర్తలు ఆరోపించారు. చాలా చోట్ల కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. వర్ధమాన్ జిల్లా కతువాలో జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందినట్టు తెలిసింది. వివిధ పార్టీల కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వస్తోంది. కాగా, ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.