: ముంబై - హైదరాబాద్ టీ-20 చూసేందుకు 414 బస్సుల్లో రానున్న ప్రత్యేక 'అతిథులు'!


అందరికీ విద్యను దగ్గర చేయాలన్న ఉద్దేశంతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన భార్య నీతా నేతృత్వంలో ప్రారంభించిన 'ఈఫా' (ఎడ్యుకేషన్ ఫర్ ఆల్) ఈ సంవత్సరం కూడా వీధి బాలలకు మైదానంలో కూర్చుని క్రికెట్ మ్యాచ్ తిలకించే అదృష్టాన్ని అందిస్తోంది. నేడు హైదరాబాదుతో వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ కి వీల్ చైర్ కు పరిమితమైన 13 మంది, వివిధ వైకల్యాలతో బాధపడుతున్న 200 మంది చిన్నారులతో పాటు మొత్తం 17 వేల మంది వీధి బాలలకు మ్యాచ్ ని చూపనుంది. ఈ ప్రత్యేక అతిధులను మొత్తం 414 బస్సుల్లో తీసుకువస్తామని, వీరికి భోజనం, మంచినీటి వసతులతో పాటు, వైద్యసేవలు అందించేందుకు నాలుగు వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్టు ఈఫా వెల్లడించింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో పాటు సచిన్ తదితర ప్రముఖులు సైతం వీరితో కాసేపు గడపనున్నారు.

  • Loading...

More Telugu News