: 700 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్ మోటార్స్


ఫోర్డ్ కార్ల కంపెనీ 700 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ప్లాంట్ ను సందర్శించారు. మూడు దఫాలుగా వీరిని తొలగిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. అమెరికాలోని డెట్రాయట్ రాష్ట్రంలోని మిషిగాన్ అసెంబ్లీ ప్లాంట్ లో వచ్చే జూన్ నుంచి మూడు షిఫ్టులకు బదులుగా రెండు షిప్టులు మాత్రమే పని జరుగుతుందని కంపెనీ పేర్కొంది. ఫోర్డ్ ఫోకస్, సీ-మ్యాక్స్ హైబ్రిడ్ కార్ల అసెంబ్లింగ్ ఇక్కడ జరుగుతుంది. డిమాండ్ కంటే సప్లయ్ ఎక్కువ కావడంతో గతంలో ఈ ప్లాంటును కొంత కాలం మూసేశారు. ఇప్పుడు ఓ షిప్టును రద్దు చేశారు. 675 మంది అసెంబ్లింగ్ కార్మికులు, 25 మంది వేతన కార్మికులను జూన్ సెప్టెంబర్ మధ్య తొలగించనున్నట్టు సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News