: కొత్త వేషాలు వేస్తున్న అదృష్టవంతులు!
లాటరీలో లక్కు కొద్దీ కోట్ల రూపాయలు వచ్చాయనుకోండి...లక్కుతోపాటు ప్రమాదం కూడా ముంచుకొస్తుంది. లాటరీల్లో లభించిన డబ్బును కాజేసేందుకు దోపిడీ ముఠాలు కాచుక్కూర్చుంటాయి. ఆ ప్రమాదం లేకుండా చైనీయులు కార్టూన్ వేషాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల చైనాలో ఓ వ్యక్తి 170 మిలియన్ల యువాన్ లు లాటరీలో గెలుచుకున్నాడు. ఆయన ప్రైజ్ మనీ తీసుకునేందుకు పాప్యులర్ డిస్నీ పాత్ర బేమాక్స్ వేషం వేసుకుని వచ్చి డబ్బు తీసుకెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అలా వచ్చినట్టు ఆయన తెలిపాడు. గతంలో 398 మిలియన్ యువాన్లు గెలుచుకున్న వ్యక్తి పాండా వేషంలో వచ్చి ప్రైజ్ మనీ తీసుకెళ్లాడట. 2011లో 565 యువాన్లు గెలుచుకున్న వ్యక్తి మిక్కీ మౌస్ వేషంలో వచ్చి డబ్బు తీసుకున్నాడట. 2014లో 520 మిలియన్ యువాన్లు గెలుచుకున్న వ్యక్తి టెడ్డీబేర్ వేషంలో వచ్చాడట. ఇలా ప్రత్యేకమైన వేషాల్లో రావడం వల్ల డబ్బుకు, తమకు సేఫ్టీ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.