: మస్తాన్ బాబుకు రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు... నివాళులర్పించిన మంత్రులు
ఆండీస్ పర్వతాల్లో దురదృష్టవశాత్తూ మరణించిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబుకు రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మస్తాన్ బాబు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని తెలిపారు. త్వరలో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మస్తాన్ బాబు మృతదేహం ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీజనసంగం చేరుకుంది. అక్కడ ఏపీ మంత్రులు రావెల్ కిశోర్ బాబు, పల్లె రఘునాథరెడ్డి, నారాయణ తదితరులు ఘనంగా నివాళులర్పించారు.