: ఇన్ఫోసిస్ దెబ్బకు లక్షన్నర కోట్ల రూపాయలు ఆవిరి!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు అసంతృప్తిని కలిగించగా, ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని సెక్టార్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రెండు రోజుల వ్యవధిలో సుమారు లక్షన్నర కోట్ల రూపాయల మదుపర్ల సొమ్ము ఆవిరైంది. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 297.08 పాయింట్లు పడిపోయి 1.07 శాతం నష్టంతో 27,437.94 పాయింట్ల వద్దా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 93.05 పాయింట్లు పడిపోయి 1.11 శాతం నష్టంతో 8,305.25 పాయింట్ల వద్దా కొనసాగాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 102 లక్షల కోట్ల నుంచి రూ.100.53 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఇన్ఫీ ఫలితాలు ఐటి సెక్టారులోని ఈక్విటీలన్నింటిపైనా ప్రభావం చూపగా, ఈ సెక్టారు 3 శాతం దిగజారింది. ఎన్ఎండీసీ, ఒఎన్ జీసీ, కెయిర్న్, టీసీఎస్, లూపిన్ తదితర కంపెనీలు 2 నుంచి 3.5 శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ ఈక్విటీ విలువ ఏకంగా 6.08 శాతం నష్టపోయింది. సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీపీసీఎల్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు 3 నుంచి 4 శాతం నష్టపోయాయి.