: ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే... మరోసారి చెప్పిన కేంద్రం
ఏపీకి ప్రత్యేక హోదా ఇక లేనట్టేనని కేంద్రం మరోసారి నర్మగర్భంగా తెలిపింది. ఎంపీ మాగంటి బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోవడంలేదని తెలిపారు. అటు, తెలంగాణ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి కూడా తెలంగాణకు ప్రత్యేక హోదా అంశంపై ప్రశ్న అడిగారు. ఆయనకూ ఇదే సమాధానం వర్తింపజేశారు మంత్రి ఇంద్రజిత్ సింగ్. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై ఆశలు వదిలేసుకున్నట్టు ఆయన మాటలే చెబుతాయి. ప్రత్యేక హోదా వస్తే లభించే నిధుల కన్నా కేంద్రం ఎక్కువ నిధులే ఇవ్వాలని భావిస్తోందని ఆయన పార్టీ నేతలతో అన్నట్టు తెలిసింది.