: షర్మిల అనే చెల్లెలే కాదు...శోభమ్మ అనే అక్క కూడా ఉండేది: జగన్
తనకు షర్మిల అనే చెల్లెలే కాదు, శోభమ్మ అనే అక్క కూడా ఉండేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలిపారు. ఆళ్లగడ్డలో జరిగిన శోభానాగిరెడ్డి ప్రథమ వర్థంతి సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భౌతికంగా శోభమ్మ లేకపోయినా, అందరి హృదయాల్లో ఆమె నిలిచి ఉన్నారని అన్నారు. తాను జైలులో ఉన్న సమయంలో శోభమ్మ కూడా వచ్చారని, నీకే ఎందుకిన్ని కష్టాలొచ్చాయని బాధపడ్డారని, ఆ సమయంలో తమ్ముడి కోసం పడుతున్న బాధను ఆమె కళ్లలో చూశానని జగన్ చెప్పారు. రాజకీయాల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారని, మంచి ఎమ్మెల్యేల కోవలో శోభానాగిరెడ్డి ఉంటారని ఆయన పేర్కొన్నారు.