: 2003లో మారుతీ 800 ధరకు... ఇప్పుడు బీఎండబ్ల్యూ కారు... ఎలాగంటే..!


గత దశాబ్ద కాలంలో స్టాక్ మార్కెట్ పనితీరు, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీల విలువను ఎలా పెంచిందో తెలిపే మరో ఉదాహరణ ఇది. మారుతీ 800 కారు... గడచిన పదేళ్ల నుంచి ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతూ వస్తున్న కారు మోడల్. సంస్థ నుంచి ఎన్ని కార్లు వచ్చినా మారుతీకి ఉన్న ఆదరణ తగ్గలేదు. అయితే, 2003లో మారుతీ సుజుకి స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన వేళ మారుతీ కారు ధర సుమారు రూ. 2 లక్షలు. ఆ సమయంలో కారును కొనుగోలు చేయకుండా, సంస్థ ఈక్విటీలను కొనుగోలు చేసి వుంటే ఆ డబ్బుతో ఇప్పుడు మెర్సిడిస్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యు వంటి ఏ విలాసవంతమైన కారునైనా కొనుక్కోవచ్చు. 2003లో సంస్థ ఐపిఓకు వచ్చినప్పుడు ఒక్కో ఈక్విటీ వాటాను రూ. 125కు విక్రయించింది. తొలి రోజు లిస్టింగ్ సమయంలో 30 శాతం అధికంగా రూ. 164 వద్ద కొనసాగింది. మారుతీ కారు ధర రూ. 2 లక్షలతో సంస్థ షేర్లు కొనుగోలు చేసి వుంటే 1600 వాటాలు వస్తాయి. ఇప్పుడు ఒక్కో వాటా ధర రూ. 3,500 వద్ద ఉంది. ఐపిఓ ధరతో పోలిస్తే ఇది 28 రెట్లు అధికం. ఈ ధరపై 1600 వాటాలను విక్రయిస్తే రూ. 56 లక్షలు చేతికందుతాయి. ఈ డబ్బుతో బీఎండబ్ల్యు, మెర్సిడిస్ బెంజ్, ఆడీలాంటి ఏ కారైనా కొనుక్కోవచ్చు కదా? అదండీ సంగతి!

  • Loading...

More Telugu News