: ఆప్ ఎంఎల్ఏ అల్కా లాంబాకు కన్నుకొట్టిన యువకుడు... లాగి ఒక్కటిచ్చిన అల్కా


అల్కా లాంబా... ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చాందినీ చౌక్ నుంచి ఎన్నికైన ఎంఎల్ఎ. ఢిల్లీ టూరిజం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కవి మిరాజ్ గాలిబ్ నివసించిన భవనాన్ని పరిశీలించేందుకు ఆమె వచ్చారు. ఆ సమయంలో రాజేష్ అనే 20 ఏళ్ల యువకుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కన్ను కొట్టాడు. దగ్గరగా వచ్చి తాకేందుకు యత్నించాడు. దీన్ని గ్రహించిన అల్కా అతని చెంపపై ఒక్క పీకు పీకారు. దీంతో రాజేష్ పరుగు లంఘించుకోగా, అక్కడే ఉన్న ఆప్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాజేష్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని బంధువులు చెబుతుండగా, అందుకు తగ్గ మెడికల్ ఆధారాలు చూపలేదని అల్కా ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News