: గులాబీ బాస్... ఎనిమిదోసారి కూడా కేసీఆరే!
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎనిమిదోసారి కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. ఈ ఉదయం ప్లీనరీ వేదికపై మాట్లాడిన ఆయన అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్ మాత్రమే దాఖలైనందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. ఈ ప్రకటన వెలువడగానే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కేసీఆర్ ను దండలతో ముంచెత్తి అభినందించారు. స్టేడియం వెలుపల బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎల్ బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను జ్యోతి వెలిగించడం ద్వారా కేసీఆర్ ప్రారంభించారు.