: హైదరాబాద్ అంతటా గులాబీ గుబాళింపులు... మొదలైన టీఆర్ఎస్ ప్లీనరీ


హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్ బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు కార్యకర్తల 'జై తెలంగాణ' నినాదాల మధ్య మొదలయ్యాయి. నగరమంతటినీ ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన కార్యకర్తలు ఎల్ బీ స్టేడియాన్ని గులాబీ గుబాళింపులతో నింపేశారు. సుమారు 30 వేల మందికిపైగా టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరైన ఈ ప్లీనరీ సమావేశాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానం అనంతరం రాష్ట్ర సాధన తరువాత తొలిసారి ప్లీనరీ నిర్వహిస్తున్న టీఆర్ఎస్, ఏడాది పాలనపై ప్రచారమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News