: ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రముఖ నాయకుల హస్తం: హోంమంత్రి చినరాజప్ప


వచ్చే 2, 3 నెలల్లో రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగును అరికడతామని ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఉద్ఘాటించారు. ఈ అక్రమ రవాణాలో ప్రముఖ నాయకుల హస్తం ఉందని చెప్పారు. వారి అండతోనే ఎర్రచందనం మాఫియా మరింత హెచ్చరిల్లుతోందని ఆరోపించారు. గత పదేళ్లలో లక్షల కోట్ల విలువైన ఎర్రచందనం అక్రమంగా తరలిపోయిందన్న రాజప్ప, పోలీసుల విచారణలో అన్ని విషయాలు బహిర్గతమవుతాయని అన్నారు. ప్రస్తుతం మారిషస్ జైల్లో ఉన్న స్మగ్లర్ గంగిరెడ్డికి బెయిల్ రాగానే ఏపీకి తీసుకువస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పలు ఈరోజు పర్యటించారు. రాష్ట్ర అతిథిగృహంలో సాగునీటి సమస్యపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. తాగునీరు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, రాజధాని నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టు అన్నీ వద్దంటారన్నారు. అసలు జగన్ కు ఏం కావాలోనని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News