: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన మంచిరెడ్డి
టీ.టీడీపీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంచిరెడ్డికి సీఎం కేసీఆర్ పార్టీ కండువాకప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. తనకు టీడీపీలో మంచి గుర్తింపే ఉందని, ఆ పార్టీని విమర్శించనని అన్నారు.