: రూ. 90 వేల కోట్ల పింఛను డబ్బు స్టాక్ మార్కెట్లోకి!
భారత స్టాక్ మార్కెట్ ఈక్విటీలలో రూ. 90 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) భావిస్తోంది. వాస్తవానికి మార్కెట్లను మరింత ముందుకు నడిపించేందుకు ఈపీఎఫ్ఓ నిధిలో కనీసం 15 శాతం మార్కెట్లకు తరలించాలని కేంద్ర కార్మిక శాఖ సూచించినా, అందుకు అంగీకరించని ఈపీఎఫ్ఓ బోర్డు 5 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. సుమారు రూ. 18 లక్షల కోట్ల రూపాయల మేరకు పీఎఫ్ నిధులను కలిగివున్న ఈపీఎఫ్ఓ నుంచి రూ. 2.7 లక్షల కోట్ల రూపాయలను మార్కెట్ కంపెనీల్లో పెట్టించాలని చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, సుమారు రూ. 90 వేల కోట్ల రూపాయలు త్వరలో వివిధ కంపెనీల ఈక్విటీల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) రూపంలో రూ. 6 లక్షల కోట్ల వరకూ పీఎఫ్ నిధులు మార్కెట్లలో ఉన్నాయి. ఈ సంవత్సరం కేవలం 5 శాతం నిధులను మాత్రమే స్టాక్స్ లో పెడతామని, వాటి పనితీరు ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈపీఎఫ్ఓ అధికారి ఒకరు తెలిపారు.