: 'వాటర్ బర్త్' విధానంలో పాపకు జన్మనిచ్చిన జాంటీ రోడ్స్ సతీమణి
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ సతీమణి మిలేనీ జెన్నీ ముంబై, శాంతా క్రజ్ లోని ఓ ఆసుప్రతిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో బిజీగా ఉన్న జాంటీ రోడ్స్ డెలివరీ కోసం మూడు నెలల ముందే ముంబై వచ్చారు. నిన్న మధ్యాహ్నం 3:29 గంటలకు పాప పుట్టిందని, 3.71 కిలోల బరువుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు వారు 'వాటర్ బర్త్' విధానాన్ని ఎంచుకున్నారని, అందుకోసం మూడు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారని వివరించారు. కాగా, తల్లికి, బిడ్డకు ఎంతో మేలు కలిగే 'వాటర్ బర్త్' విధానం ఇండియాలో అంత ప్రాచుర్యం పొందలేదు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రం అత్యధిక జననాలు ఈ విధానంలోనే జరుగుతున్నాయి.